ఓ వ్యక్తి చెవిలో గూడు కట్టిన సాలీడు

చైనా లో ఓవ్యక్తి చెవిలో సాలీడు గూడు కట్టింది. ఏంటి వినడానికి విచిత్రంగా ఉందా.. అసలు నమ్మలని కూడా లేదా. నిజమేనండి బాబు. ఓ వక్తికి చాలా రోజులనుండి చెవిలో ఏదో నోప్పిగా ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత అతనికి విపరీతమైన నొప్పి రావడంతో డాక్టర్లను సంప్రదించాడు. మైక్రో స్కోప్ తో పరిక్షించగా డాక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే సాలీడును బయటకు తీయడానికి వైద్య పరికరాలతో తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ సాలీడు తప్పించుకుపోతుండటంతో.. ఇక లాభం లేదనుకుని చెవిలో నీళ్లు పోసి సాలీడును బయటకు తీశారు. సాలీడు చిన్న సైజ్ లో ఉండటంతో తమ పరికరాలకు చిక్కలేదని చెప్పారు డాక్టర్లు. ఆతర్వాత అతని చెవిని క్లీన్ చేసి ఇంటికి పంపారు. యూట్యాబ్ లో ఈ వీడియో పెట్టగా.. ప్రస్తుతం వైరల్ గా మారింది.