ఇజ్రాయెల్ తో ఇండియా మిస్సైల్ డీల్.. టార్గెట్ పాక్

Spike Missile Deal between India and Israel.. Pak is Target

పాక్ గురిగా ‘స్పైక్’

శత్రు యుద్ధ ట్యాంకులను తునాతునకలు చేసే సత్తా గల ఇజ్రాయెలీ స్పైక్ మిస్సైల్స్ ను ఇండియా కొంటోంది. నాలుగో తరానికి చెందిన 210 స్పైక్ క్షిపణులను, 12 లాంచర్లకు ఇజ్రాయెల్ కు ఆర్డరించిం ది. ఈ డీల్ విలువ దాదాపు రూ.280 కోట్లు. శత్రువుల నుంచి ఆర్మీ ట్యాంకులను రక్షించు కోవడానికి స్పైక్ మిస్సైల్స్ చాలా అవసరం. ఇందుకు తగ్గట్టే అతి తక్కువ సమయంలోనే వీటిని ఇజ్రాయెల్ మనకు డెలివరీ చేయనుంది. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వా త పాకిస్థాన్ ఆర్మీని బోర్డర్ కు అతి దగ్గరగా మోహరించింది. దీంతో ఇండియా కూడా ముందు జాగ్ర త్త చర్యలు తీసుకుంటోంది. ఆర్మీకి కావాల్సిన అన్ని రకాల ఆయుధాలను సమకూర్చుతోంది. ఇందులో భాగంగానే స్పైక్ క్షిపణుల కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి2017లోనే వీటి కొనుగోలుకు ఇండియా–ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే కొద్ది రోజుల తర్వా త ఇండియా ఆ డీల్ ను రద్దు చేసుకుం ది. సొంతంగా ట్యాంక్ కిల్లర్ మిస్సైల్స్ ను తయారు చేయాలని మన డీఆర్డీవోను ఆదేశించింది.

స్పైక్‌‌ క్షిపణి ప్రత్యేకత ఇదే..

స్పైక్‌ క్షిపణులను ప్రయోగించడానికి ఒక జవాను చాలు. భుజంపై లాంచర్ ను మోసుకెళ్లి శత్రువుల పైకి వదలొచ్చు.

 

Latest Updates