24 గంటల్లో 8305 కరోనా కేసులు..230 మంది మృతి

భారత్ లో కరోనా పంజా విసురుతోంది. గత మూడు రోజులుగా రోజుకు 8 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం 8305 కేసులు నమోదైతే..ఆదివారం 8677 కేసులయ్యాయి. ఇక గత 24 గంటల్లో 8392 కరోనా కేసులు నమోదవ్వగా 230 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,90,535 కు చేరింది. ఇందులో 91819 మంది కరోనా నుంచి కోలుకోగా 93322 మంది చికిత్స తీసుకుంటున్నారు. 5394 మంది చనిపోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 67655కు చేరగా మృతుల సంఖ్య 2286 కు చేరింది.

Latest Updates