SPK సంస్థ పై IT దాడులు: 100 కిలోల బంగారం స్వాధీనం

తమిళనాడులో ప్రభుత్వ కాంట్రాక్టర్లే లక్ష్యంగా ఐటీ శాఖ జరిపిన దాడుల్లో కళ్లు చెదిరే ఆస్తులు, బంగారు నగలు లభించాయి.  ఇందులో భాగంగా సీఎం ఎడప్పాడి పళనిస్వామి నిర్వహిస్తున్న ప్రజాపనులశాఖ ఏ గ్రేడ్‌ కాంట్రాక్టర్‌ సెయ్యాదురై(60) నడుపుతున్న నిర్మాణ సంస్థ  SP కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాల్లో సోమవారం(జూలై-16) ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.160 కోట్ల నగదు, 100 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విరుదనగర్ జిల్లా అరుప్పుకొట్టై, చెన్నైలోని పొయెస్ గార్డెన్, క్రోంపేట, బీసెంట్‌నగర్, అభిరామపురం, కోవిలంబాక్కం సహా 30 కార్యాలయాల్లో సుమారు వందమంది ఐటీ శాఖ ఏక కాలంలో దాడులు నిర్వహించింది.

సోమవారం(జూలై-16) ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏడేళ్ల కాలంలో సెయ్యాదురై సంస్థ బినామీ సంస్థల పేరుతో అనేక పనులు చేపట్టి కేంద్రానికి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. అరుప్పుకోటలోని సెయ్యాదురై నివాసం, మరో మూడు బిల్డింగ్ లు, కళ్లకురిచ్చిలో ఆయన నడుపుతున్న నూలు మిల్లులోనూ తనిఖీలు జరిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం  …రూ160 కోట్ల నగదు, 100 కిలోల బంగారంతో పాటు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మంగళవారం(జూలై-17) కూడా తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు ఐటీ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates