కర్ణాటకలో మోడీ ప్రభంజనం : జనంతో నిండిన దారులు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బహిరంగ సభలకు జనం భారీగా తరలివచ్చారు. బాగల్ కోట్, చిక్కోడి ఏరియాల్లో మోడీ నిర్వహించిన ర్యాలీలకు హాజరైన జనాలకు సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేశారు. బీజేపీ సభలకు వస్తున్న స్పందన.. కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి చెమటలు పట్టిస్తోందని మోడీ చెప్పారు. మే 23న ఆ పార్టీ నాయకులు.. ఇంతకంటే పెద్ద షాక్ తింటారని మోడీ అన్నారు. కర్ణాటకలో ఫలితాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు మోడీ.

బాగల్ కోట్ బహిరంగసభలో మాట్లాడిన మోడీ… “కాంగ్రెస్ అస్తిత్వం కోసం కష్టపడుతోంది. దేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ జోడీ కట్టింది. ఇండియాకు ఇద్దరు ప్రధానులు ఉండాలని ఎవరైనా అనుకుంటారా.. జమ్ము కశ్మీర్ కు మరో ప్రధానమంత్రి ఉండాలని మీరు అనుకుంటున్నారా.. కాంగ్రెస్ అదే అనుకుంటోంది. వారి గెలుపుకోసం.. దేశ విభజనకు ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ లో వారి మద్దతుదారులు మాట్లాడుతున్న మాటలు అందరూ వింటున్నారు. అలాంటి దేశ వ్యతిరేక శక్తులను తిప్పికొట్టాలి” అని అన్నారు.

 

 

Latest Updates