బీసీసీఐకి స్పాన్సర్ షిప్ టెన్షన్

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌ ) 13వ ఎడిషన్‌ ప్రిపరేషన్స్‌‌కు ఎదురుదెబ్బ. మెగా లీగ్‌ టైటిల్‌ స్పాన్సర్ ‘వివో’ ఈ సీజన్‌ స్పాన్సర్ షిప్‌ రద్దు చేసుకోనుంది. ఐదేళ్లకు గాను 2017లో ఏకంగా రూ.2199 కోట్లతో భారీ డీల్‌ కుదుర్చుకొని క్రికెట్‌ వర్గాలను విస్మయపరిచిన వివో ఒప్పందం మధ్యలోనే వైదొలగడం దాదాపు ఖాయమైంది. దాంతో ఈ సీజన్‌ ను యూఏఈలో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసిన బీసీసీఐకి షాక్‌‌ తగిలింది. మరి లీగ్​ షురూ అయ్యేలోపు కొత్త స్పాన్సర్ దొరుకుతుందా?

న్యూఢిల్లీ:కరోనా దెబ్బకు కుదేలైన క్రీడా ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. వెస్టిండీస్‌‌‌‌, ఐర్లాండ్‌‌‌‌, పాకిస్థాన్‌‌‌‌ జట్లకు ఆతిథ్యం ఇచ్చిన ఇంగ్లండ్‌‌‌‌  క్రికెట్‌‌‌‌ రీస్టార్ట్‌‌‌‌కు దారి చూపించింది. ఇప్పుడు యూఏఈ వేదికగా వచ్చే నెల నుంచి ఐపీఎల్‌‌‌‌ నిర్వహించి ఫ్యాన్స్‌‌‌‌కు ట్రీట్‌‌‌‌ ఇవ్వాలని బీసీసీఐ డిసైడైంది. సెంట్రల్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ మినిస్ట్రీ నుంచి అప్రూవల్‌‌‌‌ తీసుకుంది. ఆదివారం నాటి గవర్నింగ్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో ఫ్రాంచైజీలకు మార్గని ర్దేశం చేసిన బోర్డు.. స్టాండర్డ్‌‌‌‌ ఆపరేటింగ్‌‌‌‌ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని ఖరారు చేసే పనిలో ఉంది. ఇక, హోం మినిస్ట్రీ అప్రూవల్‌‌‌‌ ఇవ్వడం.. ఫ్రాంచైజీలు ప్రత్యేక విమానాల్లో ప్లేయర్లను దుబా య్‌కు తీసుకెళ్లడమే తరువాయి అన్న టైమ్‌‌‌‌లోఉలిక్కిపాటు.

ఐపీఎల్‌‌‌‌ ప్రధాన స్పాన్సర్ , టైటిల్‌‌‌‌ రైట్స్‌‌‌‌ హక్కులు న్న చైనా మొబైల్‌‌‌‌ దిగ్గజం  వివో.. ఈ సీజన్‌‌‌‌ టోర్నీ నుంచి వైదొలగనుంది. అన్ని స్పాన్సర్లను రిటైన్‌‌‌‌ చేసుకుంటున్నట్టు జీసీ మీటింగ్‌‌‌‌లో బోర్డు స్పష్టం చేసిన 48 గంటల్లోనే వివో ఈ నిర్ణయానికి రావడం చర్చనీయాంశమైంది. బోర్డర్ లో ఇరుదేశాల మధ్య ఇటీవల జరిగిన ఘటనల తర్వాత చైనా వస్తువులపై ఇండియాలో వ్యతిరేకత పెరిగింది. జీసీలో బీసీసీఐ నిర్ణయం తర్వాత సోషల్‌‌‌‌ మీడియాలో కూడా ఘాటు విమర్శలు వచ్చాయి. దాంతో, ఈ సీజన్‌‌‌‌ నుంచి వైదొలగడమే ఉత్తమమని వివో నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ఖాళీ స్టే డియాల్లో మ్యాచ్‌‌‌‌లు జరిగితే నష్టపోయే గేట్‌‌‌‌ రెవెన్యూ (టికెట్ల అమ్మకం ద్వారా వచ్చే డబ్బు) విషయంపై ఫ్రాంచైజీలు, బోర్డు మధ్య కోల్డ్‌‌‌‌ వార్ నడుస్తోం ది. ఇప్పుడు టైటిల్‌‌‌‌ స్పాన్సర్ కూడా తప్పుకుంటే ఏం చేయాలో బోర్డుకు పాలుపోవడం లేదు.

ఈ విషయంపై బీసీసీఐ ఆఫీస్‌‌‌‌  బేరర్లు, కంపెనీ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయని  బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఒక ఏడాది స్పాన్సర్ షిప్‌‌‌‌ రద్దు చేసుకోవాడన్ని మారటోరియంలా పరిగణించి, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడితే 2021 నుంచి 2023 వరకు వివోతో కొత్త డీల్‌‌‌‌ కుదుర్చుకోవాలన్నది బీసీసీఐ ఆలోచన.

ఇప్పుడెలా..?

చైనా వస్తువుల బహిష్కరణ నినాదం తెరపైకి రావడంతో తమ స్పాన్పర్లను సమీక్షిస్తామని బీసీసీఐ ఇది వరకే ప్రకటించింది. కానీ, ఆదివారం జరిగిన జీసీ మీటింగ్ లో స్పాన్సర్లను రిటైన్‌‌‌‌ చేసుకుంటున్నట్టు  చెప్పింది. బీసీసీఐ.. వివోతో కొనసాగడం   నచ్చని వారు సెంట్రల్‌‌‌‌ మినిస్ట్రీకి ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో ఏడాదికి సుమారు రూ.440 కోట్ల డీల్‌‌‌‌తో 2022 వరకు అగ్రిమెంట్ చేసుకున్న వివో.. ఈ ఇయర్ కు తన ఒప్పందా న్ని రద్దు చేసుకుంటామని బోర్డుకు తెలిపింది. ఈ వ్యవహారాన్నిస్నే హపూర్వకంగానే పరిష్కరించుకుంటామని, వివో ఇచ్చిన బ్యాంక్‌‌‌‌ గ్యారంటీని సొంతం చేసుకోమని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ‘ఇతర పరిస్థితుల్లో స్పాన్సర్లు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే వాళ్లిచ్చి న బ్యాంక్‌‌‌‌ గ్యారంటీలను బీసీసీఐ ఎన్‌‌‌‌క్యాష్‌ చేసుకోవచ్చు. గతంలో కొన్ని ఫ్రాంచైజీల విషయంలో ఇలానే జరిగింది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు’ అని తెలిపారు.

కొత్త స్పాన్సర్ దొరికేనా?

ఈ సీజన్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌తో వివో కటీఫ్‌‌‌‌ చెప్పడం ఖాయమే. కానీ, 45 రోజుల్లో కొత్త స్పాన్సర్ దొరుకుతుందా అనేదే ప్రశ్నార్థకంగా మారింది. వన్‌‌‌‌ ఇయర్ స్పాన్సర్ షిప్‌‌‌‌ డీల్‌‌‌‌ కోసం బీసీసీఐ ఇప్పటికే ఒకటి రెండు ఇండియన్‌‌‌‌ కంపెనీలతో చర్చలు ప్రారంభించినట్టు సమాచారం. అయితే, ఇంత తక్కువ టైమ్‌‌‌‌లో ఫుల్‌‌‌‌ అమౌంట్‌‌‌‌  ( రూ. 440 కోట్లు ) ఇచ్చే స్పాన్సర్ రావడం కష్టమని బోర్డు అధికారులే అంటున్నారు. ఈసారి లీగ్ విదేశాల్లో, ఖాళీ స్టేడియాల్లో   నిర్వహించడం కూడా ప్రతికూలం కానుంది. పైగా, కరోనా ప్రభావం దృష్ట్యా ఇంత పెద్ద డీల్‌‌‌‌ కుదుర్చుకోవడం ఏ కంపెనీకైనా సాహసమే అనొచ్చు. అయితే, ఐపీఎల్‌‌‌‌కు ఉన్న క్రేజ్‌‌‌‌ దృష్ట్యా ఎవరో ఒకరు ముందు కొస్తారని బోర్డు నమ్మకంగా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.

5 సార్లు నెగెటివ్‌ వస్తేనే..

ఇండియా ప్లేయర్లు, సపోర్ట్‌‌ స్టాఫ్‌‌ కనీసం ఐదు టెస్టుల్లో కరోనా నెగెటివ్‌ అని తేలితేనే ఐపీఎల్‌‌ కోసం యూఈఏ వెళ్లనున్నారు. అలాగే, లీగ్ టైమ్‌‌లో ఐదు రోజులకొకసారి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు మెగా లీగ్‌‌ కోసం  ప్రిపేర్ చేసిన డ్రాఫ్ట్ లో బోర్డు పేర్కొంది. యూఏఈ వెళ్లే ముందు ఇండియా ప్లేయర్లు, స్టాఫ్‌‌ను  ఆయా ఫ్రాంచైజీలు 14 రోజుల క్వారంటైన్‌‌లో ఉంచాలి. దానికి వారం ముందు నుంచే అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించాలి. ఎవరికైనా పాజిటివ్ వస్తే వాళ్లని క్వారంటై న్‌‌లో పెట్టాలి. అది ముగిశాక చేసే రెండు టెస్టుల్లో నెగెటివ్‌ వస్తేనే వాళ్లను యూఏఈకి అనుమతిస్తారు. యూఈఏ చేరిన తర్వాత చేసే టెస్టుల్లో మూడు సార్లు నెగెటివ్‌ వస్తేనే బయో బబుల్‌‌లోకి అనుమతిస్తారు. తమ దేశాల నుంచి నేరుగా యూఈఏ వచ్చే  ఫారిన్‌‌ ప్లేయర్లు, స్టాఫ్‌‌ ముందుగానే రెండు సార్లు కరోనా టెస్టులు చేయించుకొని నెగెటివ్‌ రిజల్ట్‌‌ చూపించాలి. లేదంటే 14 రోజులు క్వారంటైన్‌‌ తర్వాత రెండు సార్లు  నెగెటివ్‌ వస్తే నే యూఈఏలోకి అనుమతిస్తారు.

Latest Updates