కరోనా వ్యాక్సిన్ : మనోళ్లపై ‘స్పుత్నిక్-V’ ట్రయల్స్..

‌‌అడ్వాన్స్ డ్ స్టే జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 వ్యా క్సిన్లు
యూపీ, హిమాచల్, పంజాబ్‌ లకూ కేంద్ర బృందాలు

న్యూఢిల్లీ: రష్యా తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-V’తో మన దేశంలో రెండు మూడు రోజుల్లోనే హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ట్రయల్స్ కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, చట్టబద్ధంగా అన్ని అనుమతులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. స్పుత్నిక్-V హ్యూమన్ ట్రయల్స్ త్వరలో స్టార్ట్ కానున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ ఇటీవల చెప్పారు. ఫేజ్ 2, 3 ట్రయల్స్ ను ఒకేసారి కలిపి చేస్తారని, ఇందుకోసం పర్మిషన్లు కూడా వచ్చాయన్నారు. స్పుత్నిక్-V వ్యాక్సిన్ ను మాస్కోకు చెందిన గమలేయా ఇనిస్టిట్యూట్ డెవలప్ చేసింది. మనదేశంలో దీనికి ట్రయల్స్ నిర్వహించి, పంపిణీ చేసేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సంస్థ హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తో డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రెడ్డీస్ ల్యాబ్ కు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఆర్డీఐఎఫ్ అందిస్తోంది.

అడ్వాన్స్ డ్ స్టేజ్ లో 5 వ్యాక్సిన్‌లు..

దేశంలో ప్రస్తుతం 5 కరోనా వ్యాక్సిన్ లు అడ్వాన్స్ డ్ స్టేజ్ లలో ఉన్నాయి. నాలుగు వ్యాక్సిన్ లు ఫేజ్ 2, 3 ట్రయల్స్ లో, మరో వ్యాక్సిన్ ఫేజ్ 1, 2 ట్రయల్స్ లో ఉన్నాయి. స్పుత్నిక్-V వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ రెండు మూడు రోజుల్లో ప్రారంభం కానుండగా, బయోలజికల్ ఇ వ్యాక్సిన్ కూడా ఫేజ్ 1, 2 హ్యూమన్ ట్రయల్స్ దశలో ఉంది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు మనదేశంలో ఫేజ్ 3 హ్యూమన్ ట్రయల్స్ పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ తయారు చేస్తున్న కొవ్యాగ్జిన్ వ్యాక్సిన్ కు కూడా ఫేజ్ 3 ట్రయల్స్ షురూఅయ్యాయి. క్యాడిలా హెల్త్ కేర్ నుంచి వస్తున్న జైకొవ్ డీ వ్యాక్సిన్ ఫేజ్ 2 ట్రయల్స్ దశలో ఉంది.

ర్యాపిడ్ టెస్టులతోనే వైరస్ కు చెక్

ఒక్క వారంలో జనాభాలో సగం మందికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేస్తే.. కరోనా వ్యాప్తిని కొన్ని వారాల్లోనే కట్టడి చేయొచ్చట. స్కూళ్లు, దుకాణాలు, బార్లు, రెస్టారెంట్ల వంటివేవీ మూసేయాల్సిన అవసరం కూడా లేకుండానే ఈ స్ట్రాటజీతో వైరస్ కు చెక్ పెట్టొచ్చని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో సైంటిస్టులు  చెప్తున్నారు. పీసీఆర్ టెస్టుల్లో కంటే యాంటీజెన్ టెస్టుల్లో వైరల్ లోడ్ వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటేనే పాజిటివ్ గా వస్తుందని, దీనివల్ల వారం రోజుల్లోనే జనాభాలో సగం మందికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేసి, జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ కొన్ని వారాల్లోనే కంట్రోల్ అవుతుందని వీరు ‘సైన్స్ అడ్వాన్సెస్’ అనే జర్నల్ లో పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో పేర్కొన్నారు. ఆర్టీ ల్యాంప్ టెస్టులతోనూ కొంత ఫలితం ఉంటుందని వీరు తెలిపారు. అందరినీ ఇంట్లో కూర్చోవాలని చెప్పడం కంటే.. వైరస్ సోకినోళ్లను వేగంగా గుర్తించి, వారిని మాత్రమే ఇంట్లో ఉండాలని చెప్తేనే మంచి ఫలితాలు వస్తాయని రీసెర్చర్లు
సూచించారు.

మరో 3 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..

కరోనా యాక్టివ్ కేసులు అత్యధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం హైలెవల్ టీమ్ లను పంపింది. ఈ రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు, హాస్పిటల్ లో చేరుతున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా మేనేజ్ మెంట్ విషయంలో సాయం చేసేందుకు నిపుణుల బృందాలను పంపినట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఆదివారం వెల్లడించింది. కేంద్రం ఇప్పటికే హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు నిపుణుల బృందాలను పంపింది.

For more News….

ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్​ కోసం పేద దేశాలు వెయిటింగ్​

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

ఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు

రికవరీ కాలేకపోతున్నవిమాన కంపెనీలు

Latest Updates