స్పుత్నిక్ టీకా ఒక డోసు ధ‌ర ప్రకటించిన అపోలో

స్పుత్నిక్ టీకా ఒక డోసు ధ‌ర ప్రకటించిన అపోలో

దేశంలో ఇదివరకే రెండు కోవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లు కు పూర్తి స్థాయిలో ఆమోదం రావడంతో..వాటిని విజయంతంగా పంపిణీ చేస్తున్నారు. అయితే కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందడం.. భారీగా మృతుల సంఖ్య నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం, డీసీజీఐ రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి అందుబాటులోకి వచ్చేసింది.

స్పుత్నిక్ వీ టీకా ధ‌ర‌ను ఇవాళ(శుక్రవారం) అపోలో ఆస్పత్రి ప్ర‌క‌టించింది. ఒక డోసు స్పుత్నిక్ వీ టీకాను రూ.1195కు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. జూన్ రెండ‌వ వారం నుంచి దేశంలోని అన్ని అపోలో ఆస్పత్రుల్లో ఈ టీకాల‌ను ఇవ్వ‌నున్నారు. వ్యాక్సిన్‌కు రూ.995 చార్జ్ చేస్తామ‌ని.. అడ్మినిస్ట్రేష‌న్ ఫీజుగా మ‌రో రూ.200 వ‌సూల్ చేస్తామ‌ని చెప్పింది.

ఇప్పటి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 80 చోట్ల‌ ప‌ది ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చిన‌ట్లు అపోలో హాస్పిట‌ల్స్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మ‌న్ శోభ‌నా కామినేని తెలిపారు. ఇక జూన్ నెల‌లో ప్ర‌తి వారానికి 10 ల‌క్ష‌ల మందికి టీకాలు ఇస్తామన్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లోగా రెండు కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.