దుమ్ములేపిన వార్నర్, బెయిర్ స్టో .. ఫోర్త్ ప్లేస్ కి SRH

హైదరాబాద్ : IPL 12వ సీజన్ లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది హైదరాబాద్ సన్ రైజర్స్. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో సుడిగాలిలా రెచ్చిపోవడంతో… 160 రన్స్ టార్గెట్ ను SRH 15 ఓవర్లలోనే ఛేదించింది. గత మ్యాచ్ లో విన్నింగ్ ట్రాక్ ఎక్కిన హైదరాబాద్… ఈ మ్యాచ్ లోనూ సత్తా చాటింది. కోల్ కతా వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఫీల్డింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 రన్స్ చేసింది. క్రిస్ లిన్(51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. రింకూ సింగ్ 30, సునీల్ నరైన్ 25 రన్స్ చేశారు. చివర్లో వచ్చిన విధ్వంసక ఆటగాడు రసెల్ 2 సిక్సర్లు కొట్టినప్పటికీ.. 15 రన్స్ కే వెనుదిరిగాడు. ఖలీల్ అహ్మద్ 3, భువనేశ్వర్ 2, సందీప్ శర్మ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.

160 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్… బుల్లెట్ వేగంతో టార్గెట్ ను ఛేదించింది. సన్ రైజర్స్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో సిక్సర్లు, ఫోర్ల మోత మోగించారు. ఓవర్ 10 పైనే రన్ రేట్ తో పరుగులు చేస్తూ…. హాఫ్ సెంచరీలు పూర్తిచేశారు. 12.2 ఓవర్లలోనే 131 పరుగులు జోడించారంటే వీరిద్దరూ ఎంత వేగంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.  ఒక వికెట్ నష్టపోయి 15 ఓవర్లలోనే టార్గెట్ ను రీచయ్యింది హైదరాబాద్.

డేవిడ్ వార్నర్ 38 బాల్స్ లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 రన్స్ చేసి ఔటయ్యాడు. బెయిర్ స్టో 43 బాల్స్ లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. చివరి 3 బాల్స్ ను 4, 6, 6 బాది విన్నింగ్ షాట్ కొట్టాడు బెయిర్ స్టో. కేన్ విలియమ్సన్ 8 రన్స్ తో నాటౌట్ గా ఉన్నాడు.

Latest Updates