శ్రీ చైతన్య స్కూల్ టీచర్ల ఆందోళన

మాదాపూర్ బ్రాంచ్ ముందు నిరసన.. మద్దతు ప్రకటించిన బీజేపీ

హైదరాబాద్: మాదాపూర్ లోని శ్రీచైతన్య లో పనిచేసే ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం అవలంబిస్తున్న తీరుతో విసిగిపోయి నిరసనకు దిగారు. వీరికి మాజీ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మద్దతు తెలిపారు. నెలకు లక్షల రూపాయల ఫీజులతో పాటు ఆన్లైన్ క్లాసుల పేరుతో డబ్బులు దండుకుంటున్నారే తప్ప విద్య సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఎలాంటి జీతాలు చెల్లించడం లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక జీవోలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అలసత్వం వహించడం సరికాదని అన్నారు. వెంటనే వారికి జీతాలు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థల పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో 100 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులతోపాటు వివిధ సంఘాల నేతలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Latest Updates