శ్రీలంక పేలుళ్లు: అండర్ గ్రౌండ్ లో మాస్టర్ మైండ్ ఫ్యామిలీ

శ్రీలంకలో ఈస్టర్ రోజున జరిగిన పేలుళ్ల కేసులో అనుమానితులుగా భావిస్తున్న వ్యక్తి కుటుంబం మొత్తం కనిపించకుండా పోయింది. ఈ నెల 18 నుంచి తన కుటుంబ సభ్యులెవరూ కనిపించడంలేదని… పేలుళ్ల మాస్టర్ మైండ్ జహ్రాన్ హషీమ్ సోదరి తెలిపారు. జహ్రన్ హషీమ్, అతని భార్య, ఇద్దరు పిల్లలు, మొహమ్మద్ జెయిన్ హషీమ్, అతని భార్య, ముగ్గురు పిల్లలు, మొహమద్ రిల్వన్ హషీమ్ అతడి భార్య ఇద్దరు పిల్లలు, యసీరా హషీమ్ ఆమె భర్త, ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోయారని జహ్రన్ హషీమ్ సోదరి హషీమ్ మదానియా తెలిపారు. వీరంతా 18 నుంచి కనిపించడంలేదని  హషీమ్ మదానియా చెబుతుండగా… 21న పేలుళ్లు జరిగాయి. కొంలంబో జరిగిన 8 పేలుళ్లలో 253 మంది చనిపోయారు.

మరోవైపు ఆరుగురు అనుమానితుల ఫొటోలను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నరు. పేలుళ్లలో తొమ్మిది మంది సూసైడ్ బాంబర్లు పాల్గొన్నట్టు భావిస్తున్నారు. నిన్న 16మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ చేసినవారి సంఖ్య 76కు చేరింది. వీరందరికీ స్థానిక ఉగ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ తో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

Latest Updates