బఫే క్యూలో ప్లేట్ పట్టుకుని నిలబడి బ్లాస్ట్: ఇలా పేల్చేసుకున్నాడు

ఆదివారం ఉదయం 8.45 నిమిషాలు.

అది శ్రీలంక రాజధాని కొలంబో.

సిన్నమొన్ గ్రాండ్ హైఎండ్ లగ్జరీ హోటల్ వీకెండ్ లో కిటకిటలాడుతోంది.

సమయం ఉదయం బ్రేక్ ఫాస్ట్ బఫే టైమ్.

ఈస్టర్ సండే సందర్భంగా… ఈ సీజన్ లోనే అత్యంత రద్దీగా ఉంది ఆ హైఎండ్ లగ్జరీ హోటల్. శ్రీలంకను విజిట్ చేసేందుకు… ప్రముఖ చర్చ్ లలో ఈస్టర్ ప్రార్థనలు జరిపేందుకు వచ్చిన ఫారినర్స్ తో ఆదివారం ఉదయం కిక్కిరిసిపోయి ఉంది ఆ హోటల్.

హోటల్ రూమ్ లో దిగినవారంతా… బ్రేక్ ఫాస్ట్ కోసం అక్కడికి వచ్చారు. అందరూ క్యూలైన్లలో నిలబడ్డారు. తమ వంతు కోసం ఓపిగ్గా నిలబడి ఉన్నారు. అందులో ఒకడున్నాడు. పైకి చూస్తే మనిషే. కానీ… వాడు మనిషి కాదని.. తమ ప్రాణాలు తీసేందుకొచ్చిన రాక్షసుడని అక్కడున్నవారికి తెలియదు. పాపం తమలో ఒకడనుకున్నారు. పక్కనే చోటిచ్చారు. అంతే… ఒక్కసారిగా బ్లాస్ట్. భారీ శబ్దం. కకావికలం. చెల్లాచెదురు. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే.. మనషులే మృతదేహాలయ్యారు. శరీరాలు చెల్లాచెదురయ్యాయి. బాడీ పార్ట్స్ ముక్కలయ్యాయి. ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమైపోయింది.

మొహ్మద్ అజామ్ మొహమ్మద్. ఈ హోటల్ లో మారణహోమానికి కారకుడు. పేలుడు జరగడానికి ముందురోజు రాత్రి ఆ హోటల్ కు వచ్చాడు. అందరిలాగే ఓ రూమ్ లో దిగాడు. కానీ.. ఇతడి ఆలోచనలు వేరు. ఉదయాన్నే తన విధ్వంసక ఆలోచనను అమలుచేశాడు. బాంబులను నడుంకు, వెన్నుకు అమర్చుకుని బఫే దగ్గరకు వచ్చాడు. ప్లేట్ పట్టుకుని క్యూలో నిలబడ్డాడు. నిండు హాల్ లో తనను తాను పేల్చేసుకున్నాడు.

హోటల్ లో ప్రాణాలతో బయటపడిన సిబ్బంది.. జరిగిన ఘోరం గురించి పోలీసులకు వివరించారు. అతిధులు, వీఐపీలకు స్వాగతం పలుకుతూ తమ హోటల్ మేనేజర్లు కూడా ప్రాణాలు కోల్పోయారని బాధపడుతూ చెప్పారు. సూసైడ్ బాంబర్ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు.

షాంగ్రీ-లా, కింగ్స్ బరీ హోటల్స్…. మరో 3 చర్చ్ ల్లోనూ ఇదే సమయంలో పేలుళ్లు జరిగాయి. ఉగ్రమూక.. ప్రణాళిక ప్రకారం ఈ పేలుళ్లకు పాల్పడినట్టు తేల్చారు పోలీసులు.

హిస్టారిక్ క్యాథలిక్ సెయింట్ ఆంటోనీస్ చర్చ్ లో అయితే మారణహోమమే జరిగింది. అత్యంత ఎక్కువ ప్రాణనష్టం జరిగింది ఇక్కడే.

 

 

Latest Updates