శ్రీలంక యంగ్ క్రికెటర్ అరెస్ట్

కొలంబో: శ్రీలంక యువ క్రికెటర్‌‌ కుశాల్ మెండిస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొలంబో సబ్‌ఆర్బ్‌లోని పనదురాలో ఆదివారం ఉదయం సైకిల్‌పై వెళ్తున్న ఓ 64 ఏళ్ల వృద్ధుడిని మెండిస్ కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన సదరు ముసలాయనను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతూ ఆ వృద్ధుడు చనిపోయాడు.

మెండిస్‌ను ఈరోజే మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.  ఘటన జరిగిన సమయంలో మెండిస్‌తోపాటు సదరు ముసలాయనలో ఎవరైనా మద్యం మత్తులో ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. 25 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన కుశాల్ మెండిస్ లంక తరఫున 44 టెస్టులు, 76 వన్డేలు ఆడాడు. కరోనా లాక్‌డౌన్ తర్వాత ట్రెయినింగ్‌ను షురూ చేసిన లంక స్క్వాడ్‌లో కుశాల్ కూడా ఉన్నాడు. కాగా, మహమ్మారి కారణంగా ఇండియా టూర్‌‌తోపాటు శ్రీలంక ఆడాల్సిన మిగతా సిరీస్‌లు కూడా రద్దయ్యాయి. 

Latest Updates