శ్రీలంక కొత్త పర్యావరణ జెర్సీ

ఇంగ్లాండ్‌, వేల్స్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ 2019 ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్ లో మొత్తం 10 టీంలు పాల్గొంటున్నాయి. లండన్‌లోని ఐకానిక్‌ ది ఓవల్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది.  ఈ మ్యాచ్ కు ఇంకా మూడు వారాలే మిగిలి ఉండడంతో ఆయా జట్లు జెర్సీలను ఆవిష్కరించే పనిలో పడ్డాయి. బంగ్లాదేశ్‌ తన కొత్త జెర్సీని ప్రకటించగా… తాజాగా శ్రీలంక క్రికెట్‌ బోర్డు కూడా తమ జెర్సీని ఆవిష్కరించింది. అయితే శ్రీలంక ప్రత్యేకంగా సముద్రంలోని ప్లాస్టిక్‌ వ్యర్ధాలతో తయారు చేసిన జెర్సీని తీసుకొచ్చింది. శ్రీలంక తయారు చేసిన పర్యావరణ జెర్సీ ..ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పించేదిగా చేస్తుంది. లంక బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచకప్‌లో ఆడే లంక ఆటగాళ్లంతా ఈ జెర్సీనే వినియోగించనున్నారు.

 

Latest Updates