శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రాజపక్స .. మోడీ విషెష్

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గొటబయ రాజపక్స విజయం సాధించారు.  తన సమీప ప్రతర్థి అధికార యూఎన్‌పీ నేత  సాజిత్ ప్రేమదాసపై రాజపక్స గెలిచారు. రాజపక్సే గెలుపును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సాయంత్రం లోపు కౌంటింగ్ పూర్తవుతుంది. అయితే ఇప్పటి వరకు పూర్తయిన ఓట్ల లెక్కింపుల్లో రాజపక్స మెజారిటీ సాధించారు. రాజపక్సే శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స సోదరుడు. ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా విజయం సాధించిన గొటబయ రాజపక్సకు ప్రధాని మోడీ విషెస్ తెలిపారు. మీ ఎన్నికతో ఇరుదేశాలు సోదర భావంతో కలిసి ముందుకెళ్లాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల శాంతి శ్రేయస్సు,భద్రత కోసం మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా అని అన్నారు.

Latest Updates