జకీర్ నాయక్ పీస్ టీవీపై శ్రీలంక వేటు

ఐసిస్ భావజాల కార్యక్రమాలను ప్రసారం చేస్తోందంటూ ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్ పీస్ టీవీపై శ్రీలంక ప్రభుత్వం వేటు వేసింది కార్యక్రమాల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తోందంటూ చానల్‌ను నిషేధించింది. ఈస్టర్ పేలుళ్ల తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో కేబుల్ ఆపరేటర్లు టీవీ ప్రసారాలను నిలిపివేశారు. భారత్, బంగ్లాదేశ్‌లలో ఇప్పటికే పీస్ టీవీపై నిషేధం ఉంది.

ముంబైకి చెందిన  ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌-జకీర్ నాయక్ సంయుక్తంగా 2006లో పీస్ టీవీని స్థాపించారు. 2009లో ఉర్దూ, 2011లో బంగ్లా వెర్షన్‌ను కూడా ప్రారంభించారు. దుబాయ్ కేంద్రంగా ప్రసారాలు జరుగుతున్న పీస్ టీవీలో తన బోధనల ద్వారా జకీర్ నాయక్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ఉగ్రవాదులతో సంబంధాలు, మనీలాండరింగ్ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న జకీర్ నాయక్‌పై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది. 2016లో భారత్‌ను విడిచి వెళ్లిన జకీర్ ప్రస్తుతం మలేషియాలో ఉన్నట్టు తెలుస్తోంది.

Latest Updates