కప్పగంతు : ఇదేం బౌలింగ్ యాక్షన్ గురూ

శ్రీలంక స్పిన్నర్ తన బౌలింగ్ యాక్షన్ తో క్రికెట్ అభిమానుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాడు. 1995-96లో జరిగిన సౌతాఫ్రికా – ఇంగ్లాండ్ సిరీస్ లో ఫ్రాగ్ ఇన్ ఏ బ్లెండర్ అనే యాక్షనింగ్ బౌలింగ్ పరిచయమైంది. సౌతాఫ్రికాకు చెందిన  లెప్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ ఆ సిరీస్ లో తన వైవిద్యమైన బౌలింగ్ తో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. అదే తరహా యాక్షన్ బౌలింగ్ ను శ్రీలంక స్పిన్నర్ 24 సంవత్సరాల తరువాత పరిచయం చేశాడు. శ్రీలంక గాలెకు చెందిన  స్పిన్నర్ కొత్తిగూడ దుబాయ్ అబుదాబిలో జరుగుతున్న టీ10 లీగ్ లో బంగ్లా టైగర్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఫ్రాగ్ ఇన్ ఏ బ్లెండర్ (కప్పగంతు) తో బౌలింగ్ చేయడం నెట్టింట్లో వైరల్ అవుతుంది.  కొత్తి గూడ బౌలింగ్ ను డీల్ చేయడంలో స్టార్ బ్యాట్స్ మెన్లు సైతం తడబడడంపై..నెటిజన్లు ఇదేం బౌలింగ్ యాక్షన్ గురూ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

2016 లో గుజరాత్ లయన్స్ తరఫున ఐపిఎల్ అరంగేట్రం చేసిన భారత బౌలర్ శివిల్ కౌశిక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపిల్ సీజన్ లో తన మొదటి బంతిని ‘ఫ్రాగ్ ఇన్ ఎ బ్లెండర్’  తో క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకున్నాడు.

Latest Updates