శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆత్మహత్య

లాక్ డౌన్ విధులతో బిజీగా ఉన్న సమయంలో ఒక పోలీసు ఉన్న‌తాధికారి ఆత్మహత్య చేసుకోవటం ఏపీలో కలకలం రేపుతోంది. . శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ శుక్రవారం విశాఖ బీచ్‌ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు ఇటీవలే హార్ట్‌ ఆపరేషన్ అయింద‌ని, అనారోగ్య కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates