2011 వన్డే వరల్డ్​ కప్ ఫైనల్ వివాదంపై స్పందించిన శ్రీలంక బోర్డు

సంగక్కరకు నోటీసులు జారీ  

కొలంబో: 2011 వన్డే వరల్డ్‌‌‌‌కప్‌ ను శ్రీలంక టీమ్‌ ఇండియాకు అమ్మేసుకుందంటూ వచ్చిన ఆరోపణలను ఆ దేశ స్పోర్స్‌ట్ మినిస్ట్రీ సీరియస్‌ గా తీదటూసుకుంది. స్పెషల్‌‌‌‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ను నియమించి మాజీ స్పోర్స్‌ట్ మినిస్టర్‌‌‌‌ మహిందానంద చేసిన ఆరోపణలపై దర్యాప్తుకు ఆదేశించింది. ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిన ఈ స్పెషల్‌‌‌‌ యూనిట్‌ అప్పటి కెప్టెన్‌ కుమార సంగక్కరకు నోటీసులు పంపింది. శ్రీలంక మీడియా కథనాల ప్రకారం.. గురువారం ఉదయం తొమ్మిది గంటల్లో పు సంగక్కర విచారణ కమిటీ ముంద స్వయంగా హాజరై తన వివరణ ఇవ్వాలి. అప్పటి శ్రీలంక సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ అరవింద డిసిల్వ, వరల్డ్‌‌‌‌కప్‌ ఫైనల్‌‌‌‌లో ఓపెనర్‌‌‌‌ ఉపుల్‌‌‌‌ తరంగను ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ ఇప్పటికే విచారణ చేసింది. అవినీతి ఆరోపణలు చేసిన మహిందానంద స్టేట్‌మెంట్‌ను కూడా స్పెషల్‌‌‌‌ యూనిట్‌ తీసుకుంది. అయితే తనది కేవలం అనుమానం మాత్రమేనని మహిందానంద పేర్కొన్నారు.

Latest Updates