కొలంబో చర్చిలో బ్లాస్ట్ – లైవ్ వీడియో

ఈస్టర్ సండే ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవులే టార్గెట్ గా శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ ఉదయం భీకరమైన బాంబు దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. చర్చ్ లు, లగ్జరీ హోటల్స్ జరిపిన బాంబు దాడుల్లో 166మందికి పైనే ప్రాణాలు కోల్పోయారు. కొలంబోలోని సెయింట్ ఆంటోనీస్, నెగెంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చ్, బట్టికలోవాలోని ద జియాన్ చర్చ్ లలో ఈ పేలుళ్లు జరిగాయి. కొలంబో చర్చ్ లో జరిగిన బ్లాస్ట్ దృశ్యాలు ఓ కారు డ్యాష్ బోర్డ్ లోని కెమెరాలో రికార్డయ్యాయి. పేలుడు జరగడానికి ముందు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో బ్లాస్ట్ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

 

Latest Updates