మెజిషియన్ సామల వేణు టీంకు మంత్రి అభినందనలు

వియత్నంలో జరిగిన ఇంటర్నేషనల్ మ్యాజిక్ ఫెస్టివల్ లో మ్యాజిక్ చేసి  ప్రముఖుల ప్రశంసలు పొందిన మెజిషియన్ సామల వేణు బృందాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ ఫెస్టివల్ లో తెలుగు యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ కు చెందిన సి. నరేష్ ఈ మ్యాజిక్ ఫెస్టివల్ లో మంచి ప్రతిభను కనబరిచి  ప్రముఖ మెజిషియన్లు ప్రసంశలు పొందారని మంత్రికి చెప్పారు. 150 మంది  ప్రముఖ మెజిషియన్ లు పాల్గొన్న ఇంటర్నేషనల్ మ్యాజిక్ ఫెస్టివల్ లో తెలంగాణకు చెందిన సామల వేణు బృందానికి అందరి నుంచి ప్రశంసలు రావడం తెలంగాణకే గర్వకారణమని అన్నారు మంత్రి.

 

Latest Updates