RTC ఉద్యోగం వద్దన్న శ్రీనివాస్​ రెడ్డి భార్య

38 కుటుంబాలకు ఉద్యోగాలు, ఎక్స్​గ్రేషియా
గతంలో 33 మందికి, తాజాగా ఐదుగురికి ఇచ్చిన ఆర్టీసీ
ఉద్యోగం వద్దన్న శ్రీనివాస్​ రెడ్డి భార్య

హైదరాబాద్​, వెలుగు: ఆర్టీసీ సమ్మె కాలంలో చనిపోయిన 38 మంది కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు, రెండు లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియాను ఆర్టీసీ యాజమాన్యం అందజేసింది. సమ్మె కాలంలో కొందరు గుండెపోటుతో చనిపోగా, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగంతోపాటు ఎక్స్​గ్రేషియా ఇస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మొదటి విడతగా అర్హులైన 33 మందికి ఉద్యోగాలు, 12 మందికి ఎక్స్​గ్రేషియా అందజేశారు.

కొందరి విషయంలో టెక్నికల్​ సమస్యలుండడంతో వాటిని సరిచేసి వాళ్లకూ ఇచ్చారు. మొత్తంగా 8 మందికి కానిస్టేబుల్, ​ ఇద్దరికి శ్రామిక్​లు, 12 మందికి కండక్టర్​, 16 మందికి జూనియర్​ అసిస్టెంట్​ పోస్టులు ఇచ్చారు. సమ్మె టైంలో ఆత్మహత్య చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి, ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాస్​ రెడ్డి భార్యకు జూనియర్​ అసిస్టెంట్​ పోస్టు ఇచ్చారు. ఆమె ఉద్యోగం తిరస్కరించిందని, రావాల్సిన డబ్బులు కోరిందని అధికారులు చెప్పారు.

Latest Updates