శ్రీనివాస RMP ఆసుపత్రి సీజ్

క‌రోనా దృష్ట్యా..ఇప్పటికే ఆర్ ఎంపీలు, పిఎంపిలు దగ్గు జలుబు జ్వరం వచ్చిన వారికి వైద్యం చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలోనే రంగారెడ్డి జిల్లా , షాద్ నగర్ పట్టణానికి చెందిన ఆర్ ఎమ్ పి డాక్ట‌ర్ శ్రీనివాస్ కి చెందిన ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని చేగుర్ గ్రామానికి చెందిన బారతమ్మ కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే భారతమ్మకు మొదటగా ఆర్ ఎమ్ పి డాక్ట‌ర్ శ్రీనివాస్ వైద్యం చేశాడ‌ట‌. దీంతో వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు పోలీసులు ఏపీడమిక్ యాక్ట్ ప్రకారం ఆసుపత్రిని సీజ్ చేశారు. మిగతా ఆర్ ఎంపీలు ఎవరు ఆసుపత్రులు తెరిచినా కఠిన చర్యలు తీసుకుంటామని హేచ్చరించారు అధికారులు.

Latest Updates