ఉద్యోగ సంఘ నాయకుడి నుంచి మంత్రిగా శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గౌడ్ 1969 మార్చి 16న అడ్డాకుల మండలం రాచాలలో జన్మించారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లారు. పీజీ జర్నలిజం పూర్తి చేసారు. జీహెచ్ఎంసీ లో మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘ నాయకునిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2014 లో ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు శ్రీనివాస్ గౌడ్. 2014లో మొదటిసారిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన 3 వేల 139 ఓట్ల తేడాతో గెలిచారు. నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో మహబూబ్ నగర్ శాసనసభ్యుడిగా రెండోసారి 57వేల 775 ఓట్ల మెజార్టీతో రికార్డు విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు

Latest Updates