వైఎస్ వివేక హత్యకేసులో నిందితుడు ఆత్మహత్య

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబ సభ్యులు కడప జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీనివాసులు రెడ్డి తన సూసైడ్ నోట్ లో తెలిపారు. విచారణ పేరుతో తనను, తన కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. వివేకానంద హత్య కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు.సీఎం జగన్ , వైఎస్ భాస్కర్  రెడ్డిలకు వేర్వేరుగా లేఖ రాశారు శ్రీనివాసులు రెడ్డి. ఆలేఖను డాక్టర్లు అతని కుటుంబసభ్యులకు ఇచ్చారు. శ్రీనివాసులు రెడ్డిది కడప జిల్లా సింహాద్రిపురం మండలం.

Latest Updates