రామయ్యకు స్వరాభిషేకం

శ్రీరామ దివ్యక్షేత్రం భద్రాచలంలో శుక్రవారం భక్త రామదాసు 386వ జయంతిని పురస్కరించుకొని వాగ్గేయకారోత్సవాలను వైభవంగా నిర్వహించారు. దేశం నలుమూలల నుం చి వచ్చిన సంగీత కళాకారులు భక్త రామదాసు రచించిన, నేదునూరి కృష్ణమూర్తి రూపొందిం చిన నవరత్నాల కీర్తనలతో స్వామికి స్వరాభిషేకం చేశారు. అంతకు ముందు ఉదయం రామాలయంలో భక్త రామదాసు జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. –

Latest Updates