శ్రీశైలంలోకి లక్ష క్యూసెక్కుల వరద

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకు 1.03 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 52.06 టీఎంసీలకు పెరిగింది. జూరాల ప్రాజెక్టులోకి 92 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 75 వేల క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా 9.54 టీఎంసీలు ఉన్నాయి. ఎగువన ఆల్మట్టికి స్వల్పంగా వరద పెరిగింది. 30వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 45 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 90.66 టీఎంసీల నీళ్లున్నాయి. నారాయణపూర్ కు 45 వేలు, తుంగభద్రకు 8,405, ఉజ్జయినికి 2,223, నాగార్జునసాగర్ కు 450, పులిచింతలకు 6,066 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. గోదావరి బేసిన్ లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 11 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా నీటి నిల్వ 35.47 టీఎంసీలకు పెరిగింది. జైక్వాడి ప్రాజెక్టుకు 1,458, కడెం ప్రాజెక్టుకు 263 క్యూసెక్కుల వరద వస్తోంది. మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి 7,550 క్యూసెక్కులు వస్తుండగా కాకతీయ కాల్వకు 5,236 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లికి అన్నారం, సుందిళ్ల పంపుహౌస్ ల నుంచి 2 వేల క్యూసెక్కులకు పైగా నీటిని ఎత్తిపోస్తున్నారు.

Latest Updates