శ్రీశైలం హుండీ లెక్కింపు ప్రారంభం : భారీగా కానుకలు, నగదు

తన కొడుకు స్కూలుకు వెళ్లకుండా మారాం చేస్తున్నాడంటూ ఓ మహాతల్లి

కర్నూలు :  శ్రీశైలంలో ఉభయ దేవాలయాల హుండీ ఆదాయం లెక్కింపును గురువారం ప్రారంబించారు. 37రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొదటి రోజు రూ.2,91,61,059లు నగదు రాబడి వచ్చిందని తెలిపారు ఆలయ అధికారులు. నగదుతో పాటు 551 గ్రాముల బంగారం, 13 కేజీల 100గ్రాముల వెండీ లభించిందన్నారు. 448 USA డాలర్లు, 104 SAU రియాల్స్, 11 ఓమన్ రియాల్స్, 24 కత్తార్ రియాల్స్, 25 కెనడా డాలర్లు, 35 ఆస్ట్రేలియా డాలర్లు, 40 UAE దీర్హమ్స్, 50 యూరోస్, 10 ఇంగ్లాండ్ ఫౌండ్స్, 10 హాంకాంగ్ డాలర్స్, 37 మలేషియా రింగిట్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభించాయని తెలిపారు.

స్వామి వారి నిత్య కల్యాణ మండపంలో ఈ హుండీ లెక్కింపు జరుగుతోందని.. హుండీ కౌంటింగ్ లో 350 మంది సిబ్బంది, మరో 150 మంది  వలంటీర్లు పాల్గొన్నట్లు తెలిపారు. శివభక్తులు లెక్కింపులో పాల్గొన్నారని తెలిపిన ఆలయ అధికారులు… సీసీ కెమెరాల నిఘా మధ్య కట్టుదిట్టంగా హుండీ లెక్కింపు జరుగుతుందన్నారు.

Latest Updates