శ్రీశైలం షాపుల వేలం రద్దు.. కొత్త ఈవో నియామకం

శ్రీశైలంలో షాపింగ్ కాంప్లెక్సుల వేలం వివాదం

అన్యమతస్తులకు అవకాశం కల్పించారని ఆరోపణలు

సోషల్ మీడియాలో ప్రచారం తప్పుపట్టిన ఈవో

దిద్దుబాటు చర్యలు తీసుకున్న ప్రభుత్వం

శ్రీశైలం ఈవో బదిలీ.. కొత్త ఈవో నియామకం

భూ కైలాసగిరి క్షేత్రం శ్రీశైలంలో షాపింగ్ కాంప్లెక్సుల వేలం వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేదిశగా ఏపీ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం ఆలయ ఈవో రామచంద్రమూర్తిని బదిలీ చేసింది. కొత్త ఈవోగా.. రంపచోడవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఎస్ రామారావును నియమించారు. కేఎస్ రామారావును ఏడాదిపాటు డిప్యూటేషన్ పై విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేఎస్ రామారావును శ్రీశైలం కార్యనిర్వాహక అధికారిగా నియమిస్తూ… కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్ ప్రకటన విడుదల చేశారు. వెంటనే రామారావు విధుల్లో చేరాలని సూచించారు.

మరోవైపు.. వివాదానికి కారణమైన శ్రీశైలం షాపింగ్ కాంప్లెక్సుల వేలాన్ని, టెండర్లను రద్దుచేస్తూ.. ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

వివాదం ఇదీ..

షాపింగ్ కాంప్లెక్స్ వేలంలో అన్యమస్తులకు అవకాశం కల్పించారంటూ.. బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు చేసిన ఆరోపణలు శ్రీశైలంలో వేడి పెంచాయి. వేలం పాట సందర్భంగా వాగ్వాదంలో తోపులాటలు జరిగినప్పుడు కేవలం ఒక వర్గం వారి సీసీ కెమెరా విజువల్స్ బయటపెట్టి అభాసుపాలు చేయాలని చూస్తున్నారంటూ.. బీజేపీ నాయకులు మండిపడ్డారు. మంగళవారం చలో శ్రీశైలం ఆందోళనలకు పిలుపునివ్వడంతో.. పోలీసులు అలర్టయ్యారు. తనపై సోషల్ మీడియాలో ఆరోపణలను మాజీ ఈవో రామచంద్రమూర్తి తప్పుపట్టారు. ఐతే..సోమవారం సాయంత్రానికి పరిణామాలు మారిపోయాయి. షాపింగ్ కాంప్లెక్సుల వేలం రద్దయింది.

 

Latest Updates