లాక్ డౌన్ తో 14వ తేదీ వరకు శ్రీవారి దర్శనం బంద్‌

లాక్ డౌన్ తో ఇప్పటికే శ్రీవారి దర్శనాలను నిలిపేసిన TTD  పాలక మండలి… ఏప్రిల్‌ 14 వరకు రద్దు నిర్ణయం కొనసాగుతుందని తెలిపింది. దీంతో పాటు తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లనూ మూసివేశామని చెప్పింది. ప్రతి రోజూ తిరుపతిలో 30 వేల మంది నిరాశ్రయులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు టిటిడి పాలక మండలి సభ్యులు చెప్పారు. అర్చకులు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నారన్నారు. అయితే ఏప్రిల్‌ లో జరిగే వార్షిక వసంతోత్సవాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

Latest Updates