SRSPకి కొనసాగుతున్న ఇన్‌ ఫ్లో

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 12,190 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో కొనసాగుతోందని తెలిపారు ప్రాజెక్టు ఏఈఈ మహేందర్. కాకతీయ కాలువకు 4,500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 100 క్యూసెక్కులు, గుత్ప,అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు 270క్యూసెక్కులు, తాగునీటి, లీకేజీలతో 582 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోందన్నారు.

ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, సాంయత్రానికి 1084.80 అడుగులు (66.218 టీఎంసీల) నీరుంది. గతేడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం1076.00 అడుగులు (42.202 టీఎంసీల) నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు నుంచి 5,552 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లో పోతోందన్నారు. ఈ సీజన్‌లో ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి 73.942 టీఎంసీల వరద వచ్చిందన్నారు.

Posted in Uncategorized

Latest Updates