ఎస్సారెస్పీ ఫుల్లు..వరద కాల్వకు నీళ్లు

  • పైనుం చి 25 వేల క్యూ సెక్కుల వరద
  • 21వేల క్యూసెక్కులు కిందికి..
  • వరద ఇట్లనే కొనసాగితే క్రస్టు గేట్లు ఎత్తే చాన్స్

హైదరాబాద్‌‌/మోర్తాడ్, వెలుగు: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నిండుకుండలా మారింది. మహారాష్ట్రలో కురుస్తున్న వానలకు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1,091 ఫీట్లు (90.313 టీఎంసీలు) కాగా.. గురువారం సాయంత్రం వరకు 1,090.4 ఫీట్లకు (87.01 టీఎంసీలు) చేరిందని ఆఫీసర్లు తెలిపారు. పైనుంచి 25,771 క్యూసెక్కుల వరద వస్తుండగా, వివిధ ఔట్ లెట్ల ద్వారా  21,481క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నట్లు చెప్పారు. వరద కాలువ ద్వారా12,857  క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 6వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 600 క్యూసెక్కులు, గుత్ప, అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు 945 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు. వరద ఇట్లనే కొనసాగితే ప్రాజెక్టు క్రస్టు గేట్లను ఏ క్షణమైనా ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. మరోవైపు కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకూ బాగా వరద వస్తోంది. ఈ బేసిన్ లోని ప్రాజెక్టుల గేట్లను మూడోసారి ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఆల్మట్టి నుంచి మొదలుకొని శ్రీశైలం ప్రాజెక్టు వరకు అన్నింటి గేట్లను బుధవారమే ఎత్తారు.

Latest Updates