సాహో టీజర్ గురించి రాజమౌళి ఏమన్నారంటే..?

ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన సాహో మూవీ టీజర్ ఇవాళ ఉదయం రిలీజైంది. సోషల్ మీడియాలో టీజర్ కు బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సహా.. పలు భాషల్లో ఈ టీజర్ ను విడుదలచేశారు. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు పాజిటివ్ గా రియాక్టయ్యారు.

ప్రభాస్ తో కలిసి బాహుబలి- ద బిగినింగ్, బాహుబలి- ద కంక్లూజన్ లాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ మూవీస్ ఇచ్చిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సాహో సినిమా టీజర్ పై స్పందించారు. సాహో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బడ్జెట్ కు న్యాయం చేసిందని అన్నారు. తన బాధ్యతను కూడా సుజీత్ నెరవేర్చుతూ న్యాయం చేసినట్టుగా అనిపిస్తోందన్నారు. సాహో టీజర్ టెర్రిఫిక్ గా ఉందన్నారు. అందరినీ సమ్మోహన పరిచే మ్యాచో రూపం, నటన ప్రభాస్ బలం అని అన్నారు. అంతేకాదు.. అతను అభిమానులకు డార్లింగ్ కూడా అన్నారు రాజమౌళి.

Latest Updates