డెరెక్టర్ రాజమౌళికి కరోనా.. ఫ్యామిలీ మెంబర్స్‌కూ పాజిటివ్

హైదరాబాద్‌: దర్శకధీరుడు రాజమౌళికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్‌‌ ద్వారా తెలిపారు. తనతోపాటు మొత్తం ఫ్యామిలీకి కరోనా సోకిందని జక్కన్న పోస్ట్‌ చేశాడు. ఫ్యామిలీలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని అయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉంటున్నట్లు చెప్పాడు.

‘నాకు నా ఫ్యామిలీ మెంబర్స్‌కు కొన్ని రోజుల క్రితం జ్వరం లక్షణాలు కనిపించాయి. అది తగ్గుముఖం పట్టినా మేం టెస్టులు చేయించుకున్నాం. రిజల్ట్స్‌లో కరోనా పాజిటివ్‌గా తేలింది. డాక్టర్‌‌ల సూచనల మేరకు మేం హోం క్వారంటైన్‌లో ఉంటున్నాం. ప్రస్తుతానికి ఎలాంటి లక్షణాలు లేకుండా బాగున్నాం. కానీ జాగ్రత్తలు పాటిస్తున్నాం. యాంటీబాడీస్ డెవలప్ అవడం కోసం ఎదురు చూస్తున్నాం. అవి వృద్ధి కాగానే ప్లాస్మా డొనేట్ చేస్తాం’ అని రాజమౌళి ట్వీట్‌ చేశాడు. రాజమౌళి భార్య రమా రాజమౌళితోపాటు కూతురు ఎస్ఎస్ మయూఖ్యతో కలసి హైదరాబాద్‌లోని సొంతింట్లో ఉన్నాడని తెలిసింది.

Latest Updates