టెన్త్ తోనే.. సెంట్రల్ జాబ్

మీరు పదో తరగతి పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నారా? అదీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాల్లో స్థిర పడాలనుకుంటున్నారా?  అయితే స్టాఫ్సెలెక్షన్ కమీషన్విడుదల చేసిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్నోటిఫికేషన్మీ కోసమే. కేవలం పది పాసైతే చాలు పదిలమైన కెరీర్సొంతం చేసుకునే అద్భుత అవకాకాశం ఇది. గ్రూప్సి, నాన్గజెటెడ్‍, నాన్మినిస్టీరి యల్పోస్టులుగా పిలిచేఎంటీఎస్ఉగ్యోగానికి ఎంపికయితే ప్రారంభంలోనే 20 వేలకు పైగా వేతనాలు పొందవచ్చు.తాజా నోటిఫికేషన్లో దాదాపు 10 వేలకు పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉంది.

 ఎంటీఎస్‍ ఎగ్జా మ్‍ పదోతరగతి అర్హతతో నిర్వహించే పరీక్షే అయినప్పటికీ పీజీ, పీహెచ్ లుచేసిన వారు సైతం దరఖాస్తు చేస్తుం డడంతో పోటీ ఎక్కువగానే ఉంటుంది. ప్రశ్నలన్నీ పదోతరగతి/ఇంటర్‍ స్థాయిలోనే ఉంటాయి. పరీక్షకు ఇంకా 90 రోజుల సమయం ఉంది కాబట్టి ఒక్కో సబ్జెక్టుకు 20 రోజుల చొప్పున సాధన చేస్తూ చివరి 10 రోజుల్లో రివిజన్‍ చేస్తే మంచిది. ముఖ్యంగా పరీక్ష సెషన్స్ వారీగా నిర్వహిస్తారు కాబట్టి ముందుగా పరీక్ష రాసిన స్నేహి తులు, అభ్యర్థులు ద్వారా ప్రశ్నలు, వాటి సరళిని తెలుసుకొని వాటికి సమాంతరంగా ప్రిపేరవ్వాలి.

విధులు

మల్టీ టాస్కిం గ్ స్టాఫ్ లు కేంద్ర మంత్రిత్వ శాఖలు,ఇతర విభాగాలు, ఉన్నతాధికారుల వద్ద అన్నిరకాల రోజువారీ కార్యకలాపాలు, ఆఫీస్ పనులు చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ గా వీరిని ఆఫీస్‍అటెండెంట్స్ అని చెప్పవచ్చు. సెక్షన్‍/యూనిట్ ను శుభ్రం చేస్తూ నీట్ గా ఉంచడం, ఫైల్స్‌‌‌‌, రికార్డులు మెయిం టెన్‍ చేయడం, ఫ్యాక్స్ పంపడం, జిరాక్స్,ప్రింట్స్ తీయడం, డైరీ మెయింటెయిన్‍, డిస్పాచ్‍, పోస్టులు పంపడం, సెక్షన్‍ను భద్రంగా చూసుకోవడం, వాహనాలు నడపడంతో పాటు పై అధికారులు చెప్పిన అన్ని రకాల విధులు నిర్వర్తిం చాలి.

వేతనాలు

పనిచేసే ప్రదేశాన్ని బట్టి ఎంటీఎస్‍ అభ్యర్థులు ప్రారంభంలోనే నెలకు 18500 నుం చి 22500 వేతనం పొందుతారు. మూడేళ్ల కాలంలోనే మొదటి ప్రమోషన్‍ తీసుకునే అవకాశం ఉంటుంది. పనితీరు ఆధారంగా ఐదేళ్లలోనే మూడు నుంచి నాలుగు ప్రమోషన్లు పొందవచ్చు.వీరికి సాధారణంగా ప్యూన్‍, డఫాట్రీ, జామ్‍దార్‍,ఫరాస్‍, చౌకీదార్‍, సఫాయివాలా, మాలి,జూనియర్‍ ఆపరేటర్ వంటి జాబ్‍ ప్రొఫైల్స్ కేటాయిస్తారు. ఏ రాష్ర్టంలో ఉద్యోగం కోరుకుంటున్నామో దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి.

నోటిఫికేషన్

అర్హత : 2019 ఆగస్టు 1 నాటికి మెట్రిక్యులేషన్‍/పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. వయసు: కొన్ని పోస్టులకు 18 నుంచి 25, మరికొన్నింటికి 18 నుం చి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, ఎక్స్‌‌‌‌సర్వీస్‍మెన్‍లకు 3,పీడబ్ల్ యూడీలకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.ఫీజు:

 జనరల్‍/ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ,ఎక్స్‌‌ ‌‌సర్వీస్‌‌‌‌మెన్‌‌‌‌, దివ్యాంగులు, మహిళలకు ఫీజులేదు.పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‍, కరీం నగర్‍,వరంగల్‍, చీరాల, గుంటూరు, కాకినాడ,కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం , విజయనగరం

దరఖాస్తుకు చివరితేది: 2019 మే 29ఫీజు చెల్లింపు గడువు: 2019 మే 31టైర్ I (ఆబ్జెక్టివ్) పరీక్ష: 2019 ఆగస్టు 2 నుం చి సెప్టెంబర్‍ 06 వరకుటైర్ II (డిస్ర్కిప్టివ్‌‌‌‌) పరీక్ష: 2019 నవంబరు 17వెబ్ సైట్ : www.ssc.nic.in

ఎంపిక విధానం

రాత పరీక్షలో ఆబ్జెక్ టివ్‍ అండ్‍ డిస్ర్కిప్టివ్‍ అనే రెండుపేపర్లుంటాయి. ఆన్న్‍లో నిర్వహించే ఆబ్జెక్ టివ్‍పేపర్‍ లో నాలుగు సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలిస్తారు. సమయం 90 నిమిషాలు.నెగెటివ్‍ మార్కిం గ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్ కు మైనస్‍ అవుతుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్‍, హిందీ (ఇంగ్లిష్‍ కు తప్ప) భాషల్లోముద్రిస్తారు. పేపర్‍–I లో క్వాలిఫై అయిన వారికిమాత్ర మే రెండో దశలో వ్యా సరూప సమాధాన పరీక్ష (డిస్ర్కిప్టివ్‍ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులోషార్ట్ ఎస్సే, లెటర్‍ ఇన్‍ ఇంగ్లిష్‍ టాపిక్స్ మీద ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 50. సమయం30 నిమిషాలు. ఇంగ్లిష్ , హిందీ లేదా రాజ్యాం గంలోని 8వ షెడ్యూల్‍ లో పేర్కొన్న ఏదైనా ప్రాంతీయ భాషలో సమాధానాలు రాయవచ్చు. అక్షరదోషాలు, పంక్చుయేషన్‍ మార్క్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అర్హత పరీక్ష మాత్ర మే. పేపర్‍–Iమార్కుల ఆధారంగానే మెరిట్‍ జాబితా తయారుచేస్తారు. వివిధ షిప్టుల్ లో పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి నార్మలైజేషన్ పద్ధతి ఉపయోగిస్తారు. ఒకవేళఇద్దరు అభ్యర్థు లకు ఒకే మార్కులు వస్తే పేపర్‍–IIలో వచ్చిన మార్కులను చూస్తారు. అందులోనూ సమాన మార్కులుం టే పుట్టిన తేది, ఆల్ఫాబెటికల్‍ ఆర్డర్‍ లో పేరు వంటివి చెక్‍ చేస్తారు.

 

Latest Updates