‘పది’తో సెంట్రల్ కొలువు

ఇంటర్ ఫలితాలు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో ‘పది’ ఫలితాలు కూడా వస్తాయి. ఈ సమయంలో విద్యార్థులు సాధారణంగా ఇంటర్ లో ఏ గ్రూప్‍ తీసుకోవాలి? ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ లలో ఏ ప్రశ్నలు వస్తాయి? వంటి విషయాలను ఆలోచిస్తుంటారు. కానీ తెలుసా.. కేవలం ‘పది’ విద్యార్హతతో సెంట్రల్ గవర్నమెంట్‍ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పది ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు కూడా అర్హులే. కాకుంటే ఆగస్టు–1 కల్లా పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. స్టాఫ్‍ సెలక్షన్ కమిషన్‍(ఎస్‍ఎస్ సీ) దేశ వ్యాప్తంగా 10 వేల మల్టీ టాస్కింగ్‍ పోస్ట్ లను భర్తీ చేసేందుకు ఏప్రిల్‍ 22 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. మే 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ప్యూన్, డ్రాఫ్టరీ, జమాదార్, జూనియర్ గెస్టెట్‌‌‌‌నర్ ఆపరేటర్, చౌకీదార్, సఫాయ్‌ వాలా, మాలీ(గార్డెనర్) తదితర పోస్టులను భర్తీ చేస్తుంది. మే 25తో ఈ ప్రక్రియ ముగుస్తుంది. టైర్‍–1 పరీక్షను ఆగస్టు 2 నుంచి 6 తేదీ వరకు ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. టైర్‍–2 పరీక్షను నవంబరు 17న నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు దేశవ్యా ప్తంగా 18 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి 1.6 లక్షల మంది పరీక్షకు హాజరయ్యే అవకాశముందని పోటీ పరీక్షల నిపుణులు అంచనా వేస్తున్నా రు.

మహిళలకు ఉచితం

పదో తరగతి లేదా తత్సమాన అర్హతతోపాటు,18-–25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసు కోవడానికి అర్హులు. కొన్ని విభాగాల పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే వీలు కల్పించారు. సెంట్రల్ గవర్నమెంట్‍ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాం గులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్ఎస్‌‌‌‌సీ వెబ్‌ సైట్ ద్వారా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేయాలి. పరీక్ష ఫీజు కింద రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 100 మార్కులకు టైర్‍–1 జనరల్‍ ఇంగ్లి ష్‍, జనరల్‍ ఇంటెలిజెన్స్ అండ్‍ రీజనింగ్‍, న్యూమరికల్‍ ఆప్టిట్యూడ్‍, జనరల్‍ అవేర్ స్‍ సబ్జెక్టులలో 25 మార్కుల చొప్పున టైర్–1లో కంప్యూటర్ అభ్యర్ థుల నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇంగ్లి ష్‍/హిందీ భాషల్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆబ్జెక్టివ్‍ టైప్‍, మల్టిపుల్‍ ఛాయిస్ లలో క్వశ్చన్స్​ఉంటాయి. రాంగ్‍ ఆన్సర్ కి 0.25 మార్కులను కట్‍ చేస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. టైర్‍–1 క్వాలిఫై అయితే టైర్‍–2 పరీక్షలకు అనుమతిస్తారు.

డిస్క్రిప్టివ్ మోడ్ లో

ఈ పరీక్షను నిర్వహిస్తారు. షార్ట్ ఎస్సే/లెటర్‍ ఇన్‍ ఇంగ్లిష్ , అభ్యర్థుల భావ వ్యక్తీ కరణలో అవగాహనను పరీక్షిస్తారు. దీన్ని తెలుగు భాషలో రాసుకునే వీలుం ది. సమయం 30 నిమిషాలు. పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం, ఆన్ లైన్‍  దరఖాస్తు తదితర సమాచారం కోసం https://ssc.nic.in వెబ్‍సై ట్ ను సందర్శించండి.

Latest Updates