పబ్​జీ ఫొటోతో హాల్​ టికెట్

  • స్టూడెంట్ ఫొటో స్థానంలో పబ్జీ బొమ్మ
  •  క్రియేట్ చేసిన స్కూల్ మేనేజ్మెంట్!
  • ‘ఎస్’ ది స్కూల్​పై చర్యలు తీసుకుంటామన్న అధికారులు

స్టూడెంట్ పేరు హిదయత్ పబ్​జీ, తండ్రి పేరు తాహెర్ పబ్​జీ లైట్, తల్లిపేరు రేష్మా ఫాతిమా… స్టూడెంట్ ఫోటో ప్లేస్ లో  పబ్జీ బొమ్మ… ఇది  బుధవారం టెన్త్​ హాల్​టికెట్​లో దర్శనమిచ్చిన చిత్రం.  ఓ ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ తప్పిదం, అధికారుల నిర్లక్ష్యంతో  లేని విద్యార్థి పేరుతో ఈ హాల్​టికెట్ బయటకొచ్చింది. హైదరాబాద్​జిల్లాలోని షాలిబండలోని‘ఎస్​’ ది స్కూల్ లో 43 మంది విద్యార్థులున్నారు. కానీ మేనేజ్మెంట్ 44 మంది ఉన్నట్టు అధికారులకు వివరాలు పంపించింది. 43 మంది వివరాలు సక్రమంగానే ఉన్నప్పటికీ, మరొకరికి హిదయత్ పబ్జీ పేరుతో అప్లై చేశారు. ఈ నామినల్ రోల్స్ లో ఏమైనా తప్పులున్నాయా? అని అధికారులు తిరిగి మేనేజ్మెంట్​ను ప్రశ్నించినా అన్ని సక్రమంగానే ఉన్నాయని సమాధానం ఇచ్చారంటూ అధికారులు చెప్తున్నారు. ఇష్యూ చేసిన హాల్​టికెట్(2022114399)ను స్కూల్ ప్రతినిధి సోషల్ మీడియాలో పెట్టినట్టు అధికారులు చెప్తున్నారు. బుధవారం ఓ గంట సమయంలోనే వెబ్​సైట్ నుంచి హాల్​ టికెట్​ను 70 సార్లు  డౌన్​లోడ్​ చేసినట్టు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు విచారణ చేపట్టారు. అసలు హిదయాత్ పేరుతో స్టూడెంట్ ​లేరని గుర్తించారు.  ‘ఎస్​’ ది స్కూల్ మేనేజ్మెంట్​పై చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ‘వెలుగు’తో చెప్పారు. జినల్ హాల్​టికెట్​ను స్వాధీనం చేసుకున్నామనీ, వెబ్​సైట్​నుంచి హాల్​టికెట్​ను తొలగించామన్నారు.

Latest Updates