ప్రాక్టీస్‌కు తెలంగాణ ఓకే

5వ తేదీ నుంచి స్టేడియంలు రీఓపెన్

హైదరాబాద్, వెలుగు: దాదాపు ఐదు నెలలగా ఆటకు, ప్రాక్టీస్‌‌‌‌ కు దూరంగా ఉన్న తెలంగాణ క్రీడాకారులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో స్పోర్ట్స్ ‌అకాడమీలు, స్టేడియాలను రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు పలువురు అథ్లెట్లు, కోచ్‌లతో శనివారం జరిగిన సమావేశంలో స్పోర్ట్స్ మినిస్టర్ వి. శ్రీనివాస్ ‌‌‌‌గౌడ్‌ ఈ నెల 5వ తేదీ నుంచి స్పోర్టింగ్ ఫెసిలిటీస్‌‌‌‌, జిమ్స్‌‌‌‌, యోగా సెంటర్స్‌‌‌‌ను ఓపెన్ ‌చేసుకోవచ్చని ప్రకటించారు. అయితే, వాటి కెపాసిటీలో యాభై శాతం మాత్రమే వినియోగించుకోవాలన్నారు. క్రీడాకారులు రోజు విడిచి రోజు ప్రాక్టీస్‌‌‌‌ చేసుకునేలా క్రీడా శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రూపొంచిందిన కరోనా గైడ్ లైన్స్‌‌‌‌ను కచ్చితంగా పాటించాలన్నారు. అయితే, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఎలాంటి టోర్నీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సానియా మీర్జా, సాయి ప్రణీత్‌,
సిక్కిరెడ్డి, సుమీత్‌రెడ్డి , మహ్మద్ ‌అజరుద్దీన్‌, కోచ్ నాగపురి రమేష్‌ , తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జయేశ్‌ రంజన్ తదితరులు పాల్గొన్నారు. నూతన స్పోర్ట్స్ పాలసీ కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి వారిని కోరారు.

ఫస్ట్ ఒలింపిక్‌ షట్లర్లకు: గోపీచంద్‌

స్పోర్టింగ్‌ యాక్విటీటి కి గవర్నమెంట్‌ అనుమతివ్వడంతో దాదాపు 150 రోజుల తర్వాత పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ తిరిగి ప్రారంభం కానుంది. ప్రభుత్వ నిర్ణ‌యాన్ని స్వాగతించిన నేషనల్‌ బ్యాడ్మింటన్‌ చీఫ్ కోచ్‌ గోపీచంద్‌ తగిన జాగ్రత్తలు తీసుకొని దశల వారీగా ట్రెయినింగ్‌ ప్రారంభిస్తామని చెప్పాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) సూచన మేరకు ముందుగా ఒలింపిక్‌‌‌‌ ప్రాబబుల్స్ ‌‌‌పీవీ సింధు, సైనానెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌, సాత్విక్‌‌ ‌సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టి, అశ్వినిపొన్నప్ప, సిక్కిరెడ్డితో ప్రాక్టీస్ ‌‌స్టార్ట్‌‌‌‌ చేస్తామన్నాడు. ఆ తర్వాత మిగితా వాళ్ల‌ను
అకాడమీకి అనుమతిస్తామన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates