KCR దైవ దర్శనాల కోసమే తమిళనాడు వచ్చారు : స్టాలిన్

stalin-says-kcr-came-to-tamilnadu-for-temple-visit

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దైవదర్శనాలు చేసుకోవడం కోసమే తమిళనాడు వచ్చారని డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్నారు. ఈ ఉదయం ఏఎన్ఐతో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ తో ఫ్రంట్ చర్చలపై అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా బదులిచ్చారు. ఫ్రంట్ ఏర్పాటుకోసం కేసీఆర్ తమిళనాడు రాలేదని స్టాలిన్ చెప్పారు. గుడులు దర్శించుకోవడం కోసమే ఆయన పర్యటించారని అన్నారు.

“కేసీఆర్ నన్ను కలవాలనుకున్నారు. మర్యాదపూర్వకంగా మా భేటీ జరిగింది. థర్డ్ ఫ్రంట్ అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు. మే 23 తర్వాతే ఏ విషయంపై అయినా క్లారిటీ వస్తుంది ” అని స్టాలిన్ అన్నారు.

Latest Updates