మాల్ లో రూ.10కే చీర : సిద్ధిపేటలో మహిళల మధ్య తొక్కిసలాట

బడా షాపింగ్ మాల్స్ ఆఫర్లు పెడుతున్నాయి.. కానీ దానికి తగ్గట్టుగా జాగ్రత్త చర్యలుతీసుకోవడం లేదు. ఫలితంగా మహిళలు తీవ్రమైన ఇబ్బందిపడుతున్నారు. సిద్ధిపేట పట్టణం సీఎంఆర్ షాపింగ్ మాల్ లోనూ రూ.10ల ఆఫర్ చీరను దక్కించుకోవాలని వచ్చిన మహిళల మధ్య తొక్కిసలాట జరిగింది. సుమారుగా 20మంది మహిళలు గాయపడ్డారు.

షాపింగ్ మాల్స్ తమ గిరాకీ పెంచుకునేందుకు రూ.10లకే చీర లాంటి ఆఫర్లను ప్రకటించడం ఇటీవల పెరిగింది. ఐతే.. ఈ ఆఫర్ ను షాప్ ఓపెన్ అయిన గంట వరకే లాంటి కండిషన్లు పెడుతుంటారు. ఈ విషయం తెలియక.. వందలాది మంది పేద, మధ్యతరగతి మహిళలు షాప్ ల ముందు క్యూ కడుతుంటారు. సిద్ధిపేట CMR షాపింగ్ మాల్ లోనూ రూ.10లకే చీర ఆఫర్ పెట్టడంతో మహిళలు పొద్దటినుంచే క్యూ కట్టారు. ఆఫర్ చీర దక్కించుకునేందుకు పోటీ పడటంతో..  తొక్కిసలాట జరిగింది. సుమారుగా 20 మంది మహిళలకు గాయాలయ్యాయి.

Latest Updates