స్టార్ హోటళ్లు ఆఫీసులుగా మారుతున్నాయ్

కరోనాతో ట్రెండ్ మార్చిన మేనేజ్​మెంట్స్

వర్క్​ స్పేస్ ప్రొవైడర్లు గా నయా బిజినెస్

హైదరాబాద్, వెలుగు: కరోనా దెబ్బకు హాస్పిటాలిటీ రంగం కుదేలైపోయింది. ఒకప్పటిలా సిటీలో హోటళ్లకు గిరాకీ లేదు. ఈవెంట్ల సందడీ లేదు. దీంతో బిజినెస్ లేకుండా పోయిన స్టార్ హోటల్స్ కొత్త అవకాశాలను సృష్టించుకుంటున్నాయి. కొత్త బిజినెస్ స్ట్రాటజీలతో ముందుకు వస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే వారిని ఉంచేందుకు క్వారెం టైన్ సెంటర్లుగా కొన్ని హోటళ్లు మారగా.. వర్కింగ్ స్పేస్ ఆపరేటర్లతో కలిసి మిగతా హోటల్స్ ఆఫీస్ స్పేస్ ను  అందుబాటులోకి తీసుకువచ్చి బిజినెస్ పెంచుకుంటున్నాయి. సిటీలో కమర్షియల్ యాక్టివిటీపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, కమర్షియల్ స్పే స్, కో వర్కింగ్ స్పేస్ వంటి రంగాలు నిలిచిపోయా యి. రియల్టర్లతోపాటు హోటల్ మేనేజ్ మెంట్ వర్గాలకు బిజినెస్ పూర్తిగా పడిపోవడంతో నిర్వ హణ భారంగా మారింది. ఈ క్రమంలో సిటీలోని పలు స్టార్ హోటల్ నిర్వాహకులు వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులకు అనుగుణంగా అవకాశం కల్పిస్తున్నారు. వర్కింగ్ స్పేస్ ఆపరేటర్లతో మిలాఖత్ సిటీలో వర్కింగ్ స్పేస్, కో వర్కింగ్ స్పేస్ సేవలు అందిస్తున్న ఆపరేటర్లతో కలిసి స్టార్ హోటల్స్ మేనేజ్మెంట్స్ కొత్త బిజినెస్ మొదలెట్టాయి. హోటల్లోని కొంత స్పేస్ ను ఆయా కంపెనీ లకు నెలవారీ ప్రాతిపదికన ఇచ్చేస్తున్నాయి. పని చేసేందుకు వీలుగా ఇంటర్నెట్, ప్రింటింగ్, ఆఫీస్ డెస్క్ తోపాటు ఉద్యోగులకు ఉదయం నుంచి రాత్రి వరకు భోజన వసతి, క్యాం టీన్ ఫెసిలిటీ లతో కో వర్కింగ్ స్పేస్ లను ఆపరేట్ చేస్తున్నా యి. అయితే కొన్ని ఐటీ, మల్టీ నేషన్ కంపెనీలు నేరుగా హోటల్ మేనేజ్మెంట్లను సంప్రదించి, తమకు అవసరమైన మార్పులు సూచిస్తూ వర్కింగ్ స్పేస్ లీజుకు తీసుకుంటున్నాయ ని మాదాపూర్ లోని స్టార్ హోటల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.

స్పెషల్ ప్యాకేజీలు..

విదేశాల నగరానికి వచ్చిన వారు సిటీలోని పలు హోటళ్లలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలోనే ఉంటున్నారు. దీనికి టూరిజం శాఖ కొన్ని హోటల్ నిర్వాహకులతో కలిసి సౌకర్యాలు కల్పిస్తుండగా, మిగిలిన చిన్న, మధ్య, ప్రీమియం హోటల్స్ ఈ విధంగా బిజినెస్ అవకాశాలపై దృష్టి పెట్టాయి. ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేస్తున్నాయి. 15 రోజులుగా 45 సీట్లతో బంజారా హిల్స్ లోని స్టార్ హోటల్ లో ఆఫీస్ స్పేస్ నడిపిస్తున్నామని కో వర్కింగ్ స్పేస్ ఆపరేటర్ అభినవ్ శుక్లా తెలిపారు. టెంపరరీ లీజు రూపంలో హోటల్ స్పేస్ తీసుకుని బిజినెస్ రన్ చేస్తున్నాయి. ముందు ముందు కరోనా కేసుల్లో ఎలాంటి మార్పులు లేకపోతే మిగతా హోటల్స్ కూడా ఇదే బాట పడతాయి.

 

Latest Updates