తొలి ఈ-ట్రాక్టర్ లాంచ్.. ధర రూ.5లక్షలే

హైదరాబాద్ నగరానికి చెందిన స్టార్టప్‌ సెలిస్టియల్ ఈ–మొబిలిటీ తన తొలి ఈ–ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను  లాంచ్ చేసింది. దీని ధర రూ.5 లక్షలుగా ఉన్నట్టు కంపెనీ కో ఫౌండర్ సిద్ధార్థ దురై రాజన్ చెప్పారు. ఈ ట్రాక్టర్ డెలివరీ ఆర్డర్లను ఆరు నెలల్లో చేపడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు 100 ట్రాక్టర్లను తయారు చేస్తోన్న తాము, వచ్చే మూడేళ్లలో 8 వేల ట్రాక్టర్లను తయారు చేస్తామన్నారు. ఇది పూర్తిగా మేడిన్ తెలంగాణ ప్రొడక్ట్‌ అని తెలిపారు. బాలానగర్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో ఉన్న ఫెసిలిటీలో ప్రొడక్షన్‌ కెపాసిటీని పెంచనున్నామని వెల్లడించారు. సింగిల్ ఛార్జ్‌‌‌‌తో 75 కిలోమీటర్లు వరకు ఇది నడుస్తుందని, గంటకు 20 కిలోమీటర్లు స్పీడ్ అందుకుంటుందని కంపెనీ పార్టనర్, కో ఫౌండర్ ముబషీర్ అలీ పేర్కొన్నారు. సంప్రదాయ డీ జిల్ ట్రాక్టర్ రన్నింగ్ కాస్ట్ గంటకు రూ.150 ఉంటే, సెలిస్టియల్ ఈ –ట్రాక్టర్ రన్నింగ్ కాస్ట్ రూ.20–35 వరకు ఉంటుందన్నా రు

Latest Updates