హైదరాబాద్ లో ఇద్దరి మరణానికి కారణం ఆకలి

కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించింది ప్రభుత్వం. లాక్ డౌన్ తో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. షాపులు, రెస్టారెంట్లు మూసివేశారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రోజువారీగా కూలీ చేసుకునే వారి పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా బిక్షగాళ్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. బిక్షం వేసేవాళ్లే లేక పోవడంతో ఆకలితో చనిపోతున్నారు. లాక్ డౌన్ తో హైదరాబాద్ లో ఇద్దరు బిక్షగాళ్లు కొద్ది రోజులుగా అన్నం లేక చనిపోయారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌కి చెందిన 38 ఏళ్ల నర్రకోటి మహేష్‌ యాదవ్‌  కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. చంపాపేట పరిసరాల్లో బిక్షాటన చేస్తున్నాడు. కొన్నిరోజులుగా భోజనం లేక అపస్మారకస్థితిలో ఆదివారం రోడ్డుపై పడి ఉన్నాడు. పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.

50 ఏళ్ల మరో బిక్షగాడు ఐఎస్‌సదన్‌ దాసరి సంజీవయ్యనగర్‌లోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీలో రోడ్డు పక్కన ఆదివారం మృతిచెంది ఉన్నాడు.

Latest Updates