నిజాం మెడలు వంచిన వ్యక్తి సర్దార్

సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణ కు స్వంతంత్రం వచ్చేది కాదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. అసెంబ్లీ ఎదుట ఉన్న పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబిసి జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ప్రకాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్, గౌతమ్ రావు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన సంజయ్.. ప్రజలంతా ఐక్యంగా ముందుకెళ్ళేందుకే ఏక్తాదివస్ నిర్వహిస్తున్నామన్నారు. సర్దార్ దేశం కోసం .. ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు. నిజాం మెడలు వంచిన వ్యక్తి సర్దార్ అని అన్నారు.  సెప్టెంబర్ 17 గురించి ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజైనా కేసీఆర్ సర్దార్ పటేల్ కు నివాలులర్పించాలన్నారు. సర్దార్ చరిత్ర స్పూర్తితో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతా అని చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సర్దార్ ఆశయాలు నెరవేర్చేందుకు ఆయన స్పూర్తితో అఖండ భారత నిర్మాణం కోసం ముందుకెళ్తామన్నారు.

టీఆర్ఎస్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ ను విస్మరించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  సర్దార్ పటేల్ జన్మదిన సందర్భంగా దేశమంతా ఏక్తా దివస్ నిర్వహిస్తున్నామన్నారు. చిన్న చిన్న సంస్థానాలను దేశంలో కలిపిన మహనీయులు సర్దార్ అని అన్నారు. ఐక్యరాజ్య సమితిలో కూడా విడిగా ఉంటామని నిజాం దరకాస్తు చేసుకున్నాడన్నారు. సర్దార్ ఆ నాడు తెలంగాణ ప్రజలకు స్వంతంత్రం కల్పించేందుకు పోలీస్ యాక్షన్ ప్రకటించాడన్నారు. మజ్లీస్ కనుసైగల్లో  తెలంగాణ పాలన సాగుతుందన్నారు. టీఆర్ఎస్ పెద్దలు మజ్లీస్ మోచేతి నీళ్లు తాగుతున్నారన్నారు. సర్దార్ జయంతిని అధికారికంగా నిర్వహించాలన్నారు.

 

Latest Updates