చర్చకు సిద్ధమా..? కేటీఆర్ కు లక్ష్మణ్ సవాల్

టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. కేంద్ర నిధులపై శాఖల వారీగా కేటీఆర్ తో చర్చకు సిద్ధమని చెప్పారు. ఢిల్లీలో కాళ్ళు.. హైద్రాబాద్ లో కన్నీళ్ళు అన్నట్టు.. తండ్రీ కొడుకులు వ్యవహరిస్తున్నారన్నారు లక్ష్మణ్. దక్షిణాదిని భాతర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్న కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని,  తెలంగాణ ప్రజల‌ను రెచ్చగొట్టి వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. విభజన రాజకీయాలు చేయటం తండ్రి కొడుకుల(కేసీఆర్, కేటీఆర్)కు పరిపాటిగా మారిందని ఆయన అన్నారు.

భారత ప్రభుత్వంపై ట్విట్టర్ పిట్ట‌.. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు లక్ష్మణ్. రక్షణశాఖ భూములను కొట్టేయాలన్న టీఆర్ఎస్ ప్లాన్ ఫెయిల్ అయిందని, ఆ  భూములను ఇవ్వటం‌ కుదరదన్నందుకే.. కేంద్రంపై కేటీఆర్ ఎదురుదాడి చేస్తున్నాడన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ నిందలు వేస్తున్నాడన్నారు. కేంద్రం నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు దారి మళ్ళించారన్నారు. దక్షిణాది కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్ ఎటుపోయిందో.. కేటీఆర్ చెప్పాలన్నారు.

తెలంగాణ సెంటిమెంట్ తో ఎదిగిన టీఆర్ఎస్.. నేడు తెలంగాణ అస్థిత్వానికే ముప్పుగా తయారైందన్నారు లక్ష్మణ్. కేంద్రం ఇచ్చిన నిర్భయ నిధిని కూడా ఖర్చు చేయలేని స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. ధనిక రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు దివాలా తీయించారని ఆయన అన్నారు.

State BJP president Laxman threw challenge to TRS minister KTR

Latest Updates