రాష్ట్రాభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం

TRS పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. ఓట్ల కోసం..సీట్ల కోసం ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. జమ్మికుంటలోని వర్తక సంఘం కార్యాలయంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ అరుకాల వీరేశలింగం. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్..ప్రధాని మోడీ పై ఉన్న నమ్మకంతోనే పార్టీలో చేరికలు జరుగుతున్నాయన్నారు. త్వరలో జరగబోయే అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు. TRS పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికలు మర్చిపోయారన్నారు. బీజేపీలో డబ్బులు ఉండవు.. కేవలం కాషాయ జెండా మాత్రమే ఉంటుందన్నారు. TRS నాయకులు డబ్బు సంపాదించడం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆరోపించారు. పన్నుల రూపంలో వసూలు చేసిన నిధుల్లో ఒక్క పైసా కూడా గ్రామాల్లో ఖర్చు పెట్టడం లేదన్నారు.

కేంద్రం నుండి వచ్చిన నిధులతో మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది తప్ప..రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏం లేదన్నారు బండి సంజయ్. TRS పార్టీ నాయకులు జమ్మికుంట లో ఖబ్జాలు చేసి అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నాయకుల పర్సంటేజ్..కాంట్రాక్టుల జేబులు నింపడానికి మాత్రమే కేంద్రం నుండి వచ్చిన నిధులు వాడుతున్నారన్నారు. MIM…TRS పార్టీ కుమ్మకై రాష్ట్రంలో  అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు . రైల్వే విషయంలో స్టాక్ లోడింగ్ పాయింట్స్ జమ్మికుంట, ఉప్పల్ లో ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తామన్నారు ఎంపీ బండి సంజయ్ .

Latest Updates