కరోనా పరీక్షలు ఎక్కువ చేస్తున్న రాష్ట్రం ఏపీ: సీఎం జగన్

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతీ రోజూ 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇవాళ  కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాట్లాడిన సీఎం జగన్..రాష్ట్రంలో కేసులు ఎక్కువ వస్తున్నాయని రిపోర్టుల్లో తక్కువ చేసి చూపే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదన్నారు. రోజువారీ కరోనా పరీక్షల్లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రతి 10 లక్షల మందిలో 31 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని,  90 శాతం పరీక్షలు కొవిడ్ క్లస్టర్లలో జరుగుతున్నాయని వివరించారు. కరోనా వస్తుంది, పోతుంది… ఇప్పటి పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవించక తప్పదన్నారు సీఎం జగన్ .

Latest Updates