మున్సిపాలిటీ ఎన్నికలపై రేపు నేతలతో ఈసీ సమావేశం

మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా జరపాలన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. ఎన్నికల నిర్వహణపై మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజనపై అధికారులతో చర్చించారు.

ఎల్లుండి శుక్రవారంనాడు మరోసారి ఎన్నికల శిక్షణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు నాగిరెడ్డి. రేపు మున్సిపాలిటీ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఉంటుందని తెలిపారు. 14వ తేదీ నాడు తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు నాగిరెడ్డి.

Latest Updates