మహిళా అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

మన స్త్రీ శక్తులు వీళ్లే

20 రంగాల నుంచి 30 మంది ఎంపిక

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. 20 రంగాల నుంచి 30 మందిని ఎంపిక చేసింది. మహిళా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య శనివారం ఉత్తర్వులిచ్చారు. అవార్డులను ఆదివారం అందించనున్నారు.

ఆయువున్నంత వరకు గజ్జె కట్టి ఆడతా: జమ్ము

ఒగ్గు కథ.. ప్రాచీన తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గుకథంటే సాధారణంగా మగవాళ్లే గుర్తొస్తరు. కానీ ఓ మహిళ ఒగ్గుకథే ప్రాణంగా బతుకుతూ జీవితాన్ని కథకు అంకితం చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారానికి ఎంపికైంది. తనే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామానికి చెందిన మల్లరి జమ్ము. తండ్రి గుండాలు, తల్లి చెన్నమ్మ. మొత్తం 9 మంది పిల్లల్లో మల్లరి మూడో సంతానం. పుట్టినప్పుడే తండ్రి మొక్కుకోవడంతో దేవుడికి మల్లరి అంకితమైంది. తండ్రి నుంచి ఒగ్గు కథ నేర్చుకొని 11వ ఏట నుంచే కథలు చెప్పడం మొదలుపెట్టింది. మల్లరి వేషం కట్టి ఆడితే ఎంత టైమైనా గడిచిపోద్దని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెబుతుంటరు. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు మల్లరి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం మల్లరికి 75 ఏండ్లు. ప్రభుత్వం తనకు సాయం చేయాలని ఆమె కోరుతున్నారు. కళను బతికించడం కోసం ఆయువున్నంత వరకు గజ్జె కట్టి ఆడతానన్నారు.

రాష్ట్ర తొలి లేడీ కమర్షియల్‌‌‌‌ పైలెట్‌‌‌‌ ఫాతిమా

పేద కుటుంబంలో పుట్టిన సయ్యద్‌‌‌‌ సల్వా ఫాతిమా.. కష్టపడి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎన్ని సమస్యలొచ్చినా ఎదిరించి పైలెట్‌‌‌‌ అయ్యారు. దేశవ్యాప్తంగా కమర్షియల్ పైలెట్‌‌‌‌ లైసెన్స్ పొందిన నాలుగో ముస్లిం యువతిగా చరిత్ర సృష్టించారు. రాష్ట్రం నుంచి కమర్షియల్‍ పైలెట్‍ లైసెన్స్ పొందిన ఫస్ట్ ముస్లింగా నిలిచారు. ఫాతిమా తండ్రి బేకరీలో నౌకరు. చార్మినార్‌‌‌‌ దగ్గర కిరాయింట్లో ఉంటారు. పైలెట్‌‌‌‌ కావాలని చిన్నప్పుడే ఫాతిమా నిర్ణయించుకున్నారు. టెన్త్, ఇంటర్ రెగ్యులర్‍గా చదివాక డిగ్రీని అంబేడ్కర్‍ ఓపెన్‍ వర్సిటీలో పూర్తి చేశారు. 2007లో పైలట్‌‌‌‌ శిక్షణలో చేరారు. 2013లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2016లో మల్టీ ఇంజిన్‌‌‌‌ టైప్‌‌‌‌ రేటింగ్‌‌‌‌ కోర్సును చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 35.50 లక్షలను అందించింది. కోర్సులో భాగంగా గర్భిణిగానే న్యూజిలాండ్‌‌‌‌లో 15 గంటల పాటు మల్టీ ఇంజిన్‍ ప్లైట్‌‌‌‌ను నడిపి ట్రైనింగ్‍ పూర్తి చేశారు. ఆ తర్వాత 2016 చివర్లో ఎయిర్‌‌‌‌బస్‌‌‌‌ 320 టైప్‌‌‌‌ రేటింగ్‌‌‌‌ పూర్తి చేసి కమర్షియల్‌‌‌‌ పైలెట్‌‌‌‌గా లైసెన్స్‌‌‌‌ పొందారు.

అవార్డులు అందుకున్న వారు..

Latest Updates