కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంది: ఈటల

కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి ఈటల రాజేందర్.  అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్ డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించారన్నారు. పది వేల మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో పేషెంట్ పై ఏడాదికి రూ.1.20లక్షల నుంచి రూ.1.50లక్షలు ఖర్చు పెడుతున్నామన్నారు. డయాలసిస్ సెంటర్లు ఇంకా పెంచుతామన్నారు. జీహెచ్ఎంసీలోని మురికివాడల పేదలకు వైద్య సేవలందించేందుకు 106 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి ఈటల.

Latest Updates